Header Banner

మహిళల రక్షణ కోసం ఏపీ ప్రభుత్వ శక్తివంతమైన చర్య! "శక్తి" యాప్ లాంచ్ చేసిన సీఎం చంద్రబాబు!

  Sat Mar 08, 2025 18:24        Politics

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళల భద్రతకై కొత్త యాప్ తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఏపీ పోలీస్ శాఖ రూపొందించిన “శక్తి” యాప్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆవిష్కరించారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో పర్యటించిన ఆయన.. మహిళల భద్రత కోసం పోలీస్ శాఖ రూపొందించిన 'శక్తి' యాప్ ను ప్రారంభించారు.. చేనేత ఉత్పత్తులకు ప్రాచుర్యం కల్పించేలా చేనేత రథాన్ని కూడా ఈ సందర్భంగా ప్రారంభించారు. ఈ-వ్యాపారి పోర్టల్ డెలివరీని కూడా ఆవిష్కరించారు ఏపీ సీఎం..

ఇది కూడా చదవండి: వైసీపీకి మరో భగ్గుమనే షాక్! కొడాలి నానికి బిగుస్తున్న ఉచ్చు.. రంగంలోకి దిగిన ఏపీ పోలీసులు!


శక్తి యాప్ ఎలా పనిచేస్తుంది..?
పలు అధునాతన భద్రతా ఫీచర్లను ఈ “శక్తి” యాప్కు జోడించిది ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్.. మహిళలకు ఆపద కాలంలో అత్యవసర సహాయం అందించేందుకు “శక్తి” యాప్ కీలకంగా పనిచేయనుంది.. వన్ టచ్ SOS బటన్-వెంటనే పోలీసులను అలర్ట్ చేసి సహాయం అందిస్తుంది. Shake Trigger/Hand Gesture SoS- యాప్ ఓపెన్ చేయకుండానే SOS అలర్ట్ పంపించవచ్చు. దీని ద్వారా లైవ్ ట్రాకింగ్ అండ్ ఎవిడెన్స్ షేరింగ్ కాలర్ లోకేషన్, 10 సెకన్ల ఆడియో, వీడియో కంట్రోల్ రూమ్ కి పంపబడుతుంది.. తద్వారా పోలీసు అధికారుల తక్షణమే స్పందించేందుకు దోహదం చేస్తోంది..


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


శక్తి యాప్లో కీ ఫ్యూచర్స్..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన ఈ శక్తి యాప్లో కీలకమైన ఫ్యూచర్స్ ఉన్నాయి.. ఫిర్యాదు నమోదు, తప్పిపోయిన పిల్లల గురించి రిపోర్టు చేయడం, అక్రమ కార్యకలాపాలపై రిపోర్టు చేయడం, నైట్ షెల్టర్స్, భద్రతతో కూడిన ప్రయాణం, పోలీసు అధికారుల వివరాలు మరియు మొబైల్ నంబర్లు, వాట్సాప్ గవర్నెన్స్, అత్యవసర కాంటాక్ట్.. ఇలా ఎన్నో అధునాతన ఫీచర్స్ ను ఈ “శక్తి” యాప్ లో పొందుపరిచింది ఏపీ పోలీసుశాఖ. కాగా, ఆడబిడ్డల భద్రత కోసం ప్రత్యేకంగా యాప్ తీసుకువచ్చాం.. ఆడబిడ్డల జోలికొస్తే ఖబడ్డార్.. అదే మీకు చివరి రోజు అవుతుంది అంటూ ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మాజీ ఎమ్మెల్యే కుటుంబంలో తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో మనవడు మృతి!

 

జగన్ కి షాక్.. జనసేన గూటికి వైసీపీ మాజీ ఎమ్మెల్యే.. వైసీపీకి షాకిస్తూవారిని కూడా వెంట తీసుకెళుతున్నారుగా..

 

నన్ను మేడం అని పిలవొద్దు.. నేను మీ భువనమ్మను.! గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమంలో..

 

మంత్రి ప్రసంగంతో సినిమా చూపించారు.. RRR ప్రశంస! నోరు ఎత్తని వైసీపీ.. బుల్లెట్ దిగిందాలేదా?

 

ఏపీ మహిళలకు ఎగిరి గంతేసే న్యూస్.. ప్రభుత్వ ఆటోలుఎలక్ట్రిక్ బైక్‌లు! రాష్ట్రంలోని 8 ప్రధాన నగరాల్లో..

 

బోరుగడ్డ అనిల్‌ పరారీలో సంచలనం.. ఫేక్ సర్టిఫికెట్ డ్రామా వెలుగులోకి! పోలీసుల దర్యాప్తు వేగం!

 

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై బిగ్ అప్డేట్.. ఈ కండిషన్ వర్తిస్తుందిఆ ఛాన్స్ లేదు!

 

ట్రంప్ మరో షాకింగ్ నిర్ణయం.. ఆ వీసాపై అమెరికా వెళ్లిన వారంతా.! మళ్లీ లక్ష మంది భారతీయులకు బహిష్కరణ ముప్పు.?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #andhrapravasi #APCM #shakti #app #womens #safety #todaynews #flashnews #latestnews